Friday 2 March 2012

గురువు గారు - పేటెంట్

గురువు గారిని అడిగాను పేటెంట్ అంటే ఏమిటి అని .... దానికి గురువు గారు దీర్ఘంగా ఆలోచించి చెప్పారు "బుజ్జి ఇప్పుడు నువ్వున్నావు నీకొక క్రొత్త విషయం తెలిసింది, దాన్ని నాకు చెప్పమన్నాననుకో నువ్వేమంతావు... ఆ నేను ఎంతో కష్టపడి ఈ విషయం తెలుసుకున్నాను నీకంత సులభంగా చెప్తానా అని అవునా? నేను అన్నాను అవును గురువు గారు నేను అంత కష్టపడి తెలుసుకున్న దాన్ని నేనెందుకు అంత వీజీగా చెప్తాను..అని...గురువు గారు నవ్వి అందుకే రా ఈ పేటెంట్ సిస్టం పుట్టుకొచ్చింది, నువ్వు నీకు తెలిసిన విషయాన్ని నీకే సొంతం అని రిజిస్టర్ చేసుకుని ఆ విషయం తెలుసుకుని లబ్ది పొందిన ప్రతీవారి దగ్గర నుండి అంతో ఇంతో డబ్బులు తీసుకుంటారు అన్నమాట!  ఇలా చెప్పి గురువు గారు పరధ్యానంలోకి వెళ్ళారు... దాంతో కంగారు పడి గురువు గారిని అడిగాను...ఏంటి గురువు గారు.. ఆలోచిస్తున్నారు  అని...దానికి ఆయన  ఏం లేదు బుజ్జి ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మనకు కొత్త విషయాలు చెప్పే మన ఉపాధ్యాయులు ఎంత గొప్పవారు కదా.. మనకు లెక్కలు నేర్పే మాష్టారు అరేయ్ నేను నీకు లెక్కలు నేర్పుతున్నాను కదా నువ్వు రేపు పెద్దవాడివి అయ్యాకా ఎవరి దగ్గరయినా వడ్డీ డబ్బులు లెక్క కట్టి వసూలు చేసావనుకో దాంట్లో కొంత నాకివ్వాలి ఎందుకంటే నేనే కదా నీకు బారువడ్డీ, చక్రవడ్డీ లెక్కలు చెప్పింది అని అడగరు  కదా.. అలాగే మనకు అక్షరాలూ  దిద్దించిన మాష్టారు అరేయ్ నువ్వు రేపు రాసే ప్రతీ పదానికి నాకు పైసా లెక్క కట్టివాలి ఎందుకంటే నేనే కదా నీకు రాయడం నేర్పింది అని అడగరు కదా... అందుకేరా తల్లి, తండ్రి, గురువు, దైవం అని....మన పెద్దలు చెప్పారు...ఇలా చెప్తూ గురువు గారు ఆవలించడంతో నేను లేచి గురువు గారికి నమస్కరించి, ఒకవేళ గురువు గారు చెప్పినట్టు అన్నిట్టికి మనం మన మాస్టార్లకు డబ్బులు ఇవ్వవలిసి  వస్తే మా గురువు గారు నా మూలాన కోటీశ్వరులు అవరూ!... అని ఆలోచిస్తూ బయట పడ్డాను.

గురుభ్యో నమః   

గురువు గారు - సినిమా స్టొరీ

ఒక రోజు గురువు గారిని అడిగాను, "గురువు గారు మీరు ఈ మధ్య చాలా పరధ్యానంగా ఉంటున్నారు, ఏంటి సంగతి ?అని, దానికి గురువు గారు ఒక నిట్టూర్పు విడిచి ఏమీ లేదురా బుజ్జి నేనీ మధ్య ఒక సినిమా కథ రాసుకుంటున్నాను. అసలే ఈ మధ్య సినిమా రివ్యూ లు తెగ చదివేస్తున్నానేమో వెంటనే స్టొరీ లైన్ కాస్త చెప్పుదురు అని అడిగాను. వెంటనే గురువు గారు చెప్పడం మొదలుపెట్టారు.....

మొదట, విలన్ పరిచయం అదేనర్రా introduction  సీన్ అన్న మాట.... విలన్ తన ఏడంతస్తుల మేడ (den)  నుండి బయటకు వస్తాడు ఒకసారి రోడ్డు కు రెండు వైపులా ఉన్న ట్రాఫిక్ చూస్తాడు.... ఛీ ఈ హైదరాబాద్ లో ట్రాఫిక్ రోజు రోజుకు పెరిగిపోతుంది అని ఆలోచించి కారు వెనక సీట్లో డబ్బా లో నుండి రెండు కొబ్బరి కాయలాంటి బాంబులు తీసి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి వేసేస్తాడు. తర్వాత నెమ్మదిగా హెలికాప్టర్ తాడు పట్టుకుని జంప్.....

ఇక మన వీరో అదేనండీ హీరో introduction - హీరో కూడా   అమీర్పేట్ లో ఉన్న తన ఆఫీసు నుండి బయటకు వచ్చి అవతల వైపు ఉన్న బస్సు స్టాప్ కు వెళ్లడానికి రోడ్డు క్రాస్ చేద్దామని నిలుచుంటాడు.... ట్రాఫిక్ ఫుల్ గా ఉంటుంది అసలు రోడ్డు క్రాస్ చేసే చాన్సు ఇవ్వనన్ని వెహికల్స్ వెళ్తుంటాయి..... కానీ హీరో మాత్రం ప్రశాంతంగా ఎదురు చూస్తుంటాడు దూరడానికి సందు కోసం అలా వెయిట్ చేసే చేసీ రాత్రవుతుంది తెల్లవారుతుంది.... ఏముంది ఇక లాభం లేదని ఆఫీసు టైం అయ్యిందని తిరిగి ఆఫీసు లోకే వెళ్తాడు......

ఇప్పుడు, ఆహా ఇప్పుడు వీరోఇన్ introduction , అప్పుడే పదో తరగతి పూర్తి ఐదో attempt  లో పూర్తి చేసి, అయ్య కొనిచ్చిన బెంజ్ కారులో జూనియర్ కాలేజీకి వస్తుంది.....

ఫైనల్గా మిగిలిన స్టొరీ ఏంటి అంటే విలన్ హెలికాప్టర్ లో కాకుండా కారులో హైదరాబాద్ రోడ్డు మీద ఎప్పుడు తిరుగుతాడు. ............. అమీర్పేట్ ఆఫీసు లో పని చేసే హీరో రోడ్ క్రాస్ చేసి బస్సు స్టాప్ కు ఎప్పుడు వెళ్తాడు. . . . .. . పదో తరగతే ఐదు attempts లో పూర్తి చేసిన వీరోఇన్ ఇంటర్ ఎన్ని attempt లలో పూర్తి చేస్తుంది అని.

క్లైమాక్ష్ కు ఇంకా స్క్రీన్ ప్లే ఇంకా రాయలేదని గురువు గారు చెప్తుంటే ప్రొడ్యూసర్ ను అదేనండీ మన ప్రేమ రాజు పట్టుకోద్దామని పరుగో పరుగు. 


Thursday 1 March 2012

ఆగిపోయిన గడియారము

మా గురువు గారింట్లో ఒక ఆగిపోయిన గడియారం ఉండేది. ఆయన ఎప్పుడు దాన్ని బాగు చేయించాలని చూసేవారు కాదు, కానీ దాన్ని రోజూ శుభ్రం చేస్తుండేవారు. ఒక రోజు ఉండబట్టలేక అడిగాను గురువు గారిని, అప్పుడు గురువు గారు చెప్పారు, "చూడు బుజ్జి జీవితంలొ ఒక్కోసారి మనం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలెని పరిస్థితులలో ఉంటాము, అలాంటి సమయంలొ మనం నిశ్శబ్దముగా ఏమి చేయకుండా ఉండడము మేలు. ఎందుకంటే అప్పుడు మనము తీసుకునే ఏ నిర్ణయమయిన మనలను తప్పు దారిలోనే నడిపిస్తుంది. ఆగిపొయిన గడియారం కూడా రోజులో రెండు సార్లు సరి అయిన సమయాన్ని చూపిస్తుంది, కానీ తప్పుగా నడిచే గడియారం రోజంతా తప్పుడు సమయాన్నే చూపిస్తుంది. ఆ విషయం నాకు గుర్తుండాలనే ఆ గడియారాన్ని బాగు చేయించట్లేదు".